KGF2: ‘కేజీయఫ్‌2’ పై దర్శకుడు శంకర్‌ ప్రశంసల వర్షం...

ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘కేజీయఫ్‌2’. ఈ సినిమా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్నిప్రాంతాల్లో భారీగా వసూళ్లు చేసి రూ.1000కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

Published : 19 May 2022 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘కేజీయఫ్‌2’. ఈ సినిమా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్నిప్రాంతాల్లో భారీగా వసూళ్లు చేసి రూ.1000కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ప్రేక్షకుల నుంచే కాదు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన అగ్రతారలందరూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపగా తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విటర్‌ వేదికగా తన అభినందనలు తెలిపారు. ‘ఇన్ని రోజుల తర్వాత కేజీయఫ్‌2 చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, యాక్షన్‌, డైలాగ్స్‌ అన్ని బాగున్నాయి. యశ్‌ మాస్‌ లుక్‌లో చాలా బాగా నటించారు. ఇంత మంచి సినిమా అందించినందుకు ప్రశాంత్‌ నీల్‌కు అభినందనలు’ అంటూ చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

దీనిపై యశ్‌, ప్రశాంత్‌ నీల్‌ స్పందించారు. శంకర్‌ ట్విట్‌ స్క్రీన్‌ షాట్‌ను పంచుకున్న ప్రశాంత్‌ నీల్‌ ‘మీ అభినందనలు చాలా ప్రత్యేకమైనవి. మీ ప్రశంస ఎంతో ఆనందాన్ని కలిగించింది’. అంటూ ధన్యవాదాలు తెలిపారు. ఇక శంకర్‌ ట్విట్‌కు యశ్‌ రిప్లై ఇస్తూ ‘నేనెప్పుడూ చెబుతుంటాను మీరు నా మార్గదర్శి అని మీ మాటలు నాకెంతో సంతృప్తినిచ్చాయి’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని