Pushpa: ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘పుష్ప’, ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ దర్శకుల కాంబో.. మీరు గెస్‌ చేస్తారా..?

దర్శకులు సుమార్‌, వివేక్‌ అగ్నిహోత్రి కాంబినేషన్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 04 Nov 2022 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పుష్ప’ (Pushpa) సినిమాతో దర్శకుడు సుకుమార్‌ (Sukumar), ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files)తో వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri) జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు ఆ సడెన్‌ సర్‌ప్రైజ్‌ను ఈ డైరెక్టర్లు ఇచ్చారు. ‘సినిమాతో అంతా ఒక్కటికాబోతున్నాం. వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. మీరు ఏమైనా గెస్‌ చేస్తారా?’ అంటూ వివేక్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. దర్శకుడు సుకుమార్‌, ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’, ‘కార్తికేయ 2’ చిత్రాల నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌తో కలిసి దిగిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. దాంతో, ‘ఈ ముగ్గురు ఎలాంటి సంచలనం సృష్టిస్తారో’ అనే ఆసక్తి సినీ ప్రియుల్లో రేకెత్తుతోంది. ఈ మేరకు పలువురు కామెంట్లు చేస్తున్నారు. సినీ విశ్లేకులు సైతం ఈ ముగ్గురి కాంబోలో ఓ ప్రాజెక్టు వస్తుందంటున్నారు కానీ.. ఎవరు దర్శకుడిగా పనిచేస్తారు? ఎవరెవరు నిర్మాతలుగా వ్యవహరిస్తారు? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. మరి, ఈ క్రేజీ కాంబోలో నటించే హీరోహీరోయిన్లు ఎవరు? దానికి డైరెక్టర్‌ ఎవరు? నిర్మాత ఎవరు? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నారు సుకుమార్‌. అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప 1’కు అది కొనసాగింపుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, సుకుమార్‌.. రామ్‌ చరణ్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేశారనే వార్తలూ వచ్చాయి. ‘చాక్లెట్‌’ అనే హిందీ సినిమాతో దర్శకుడిగా మారిన వివేక్‌ ‘గోల్‌’, ‘హేట్‌ స్టోరీ’, ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’లతో బాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’తో టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందారు. ప్రస్తుతం వివేక్‌.. ‘ది దిల్లీ ఫైల్స్‌’ పనుల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని