Sekhar: రాజశేఖర్‌ స్ఫూర్తితోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చా: సుకుమార్‌

నటుడు రాజశేఖర్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయన స్ఫూర్తితోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టానని ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అన్నారు. రాజశేఖర్‌ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. ఈ సినిమాను మే 20న విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా సుకుమార్‌ హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

Published : 18 May 2022 01:48 IST

హైదరాబాద్‌: నటుడు రాజశేఖర్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయన స్ఫూర్తితోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టానని ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అన్నారు. రాజశేఖర్‌ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. ఈ సినిమాను మే 20న విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా సుకుమార్‌ హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘రాజశేఖర్‌కు నేను వీరాభిమానిని. ఆయన నటించిన ఆహుతి, ఆగ్రహం, అంకుశం, తలంబ్రాలు, మగాడు తదితర చిత్రాలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. చదువుకునే రోజుల్లో నేను ఆయన్ను ఇమిటేట్‌ చేస్తుండేవాడిని. నా పెర్ఫామెన్స్‌ మెచ్చి అందరూ ‘వన్స్‌మోర్‌’ అనేవారు. అలా నేను ఫేమస్‌ అయిపోయా. నేను సినిమాల్లోకి వెళ్లి, ఏదైనా చేయగలననే నమ్మకం కలిగేందుకు అప్పుడు రాజశేఖరే కారణమయ్యారు. చాలామంది తమ పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలనుకుంటారు. కానీ, తన ఇద్దరి కూతుర్లను నటీమణులుగా మార్చినందుకు ఆయనకు నమస్కరించాల్సిందే. దర్శకత్వం అనేది ఎంత భారంగా ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది జీవిత రాజశేఖర్‌ అటు కుటుంబాన్ని చూసుకుంటూ, ఈ చిత్రాన్ని తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఆవిడ కోసమైనా ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి అందించిన సంగీతం అత్యద్భుతంగా ఉంది. ఆయన మన చిత్ర పరిశ్రమలో ఉండటం గౌరవం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు యువ నటుడు రాజ్‌తరుణ్‌, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని