Ahimsa: ఆసక్తిగా ‘అహింస’ సినిమా టీజర్‌..!

వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడు తేజ. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘అహింస’. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్నారు.

Published : 06 Oct 2022 10:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడు తేజ. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘అహింస’. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్నారు. దీనిలో గీతికా తివారీ కథానాయిక. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ శైలిలో యువతరాన్ని ఆకట్టుకునే విధంగా అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం ఇది నిర్మాణాంతర పనుల దశలో ఉంది. విడుదల తేదీని తర్వలోనే ప్రకటించనున్నారు. రజత్‌ బేడీ, సదా, రవి కాలే, కమల్‌ కామరాజు తదితరులు దీనిలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇటీవల విడుదలైన ‘నీతోనే నీతోనే నేనెపుడూ..’ అనే పాట ప్రేక్షకాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts