Disha Patani: అదే నా ఆయుధం
వన్ సైడ్ లవ్ ఫీలింగ్‌ను తానూ అనుభవించానంది నటి దిశా పటానీ. ఆ ప్రేమను ఓ పాట రూపంలో చెప్పాలంటే దానికి ‘ఏక్ విలన్ రిటర్న్స్’ చిత్రంలోని ‘‘గలియాన్’’ గీతం సరిగ్గా సరిపోతుందంటోంది. ప్రస్తుతం ‘యోధ’, ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్)
వన్ సైడ్ లవ్ ఫీలింగ్‌ను తానూ అనుభవించానంది నటి దిశా పటానీ. ఆ ప్రేమను ఓ పాట రూపంలో చెప్పాలంటే దానికి ‘ఏక్ విలన్ రిటర్న్స్’ చిత్రంలోని ‘‘గలియాన్’’ గీతం సరిగ్గా సరిపోతుందంటోంది. ప్రస్తుతం ‘యోధ’, ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్) చిత్రాలతో బిజీగా గడుపుతున్న దిశా.. తాజాగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. సీరియల్ కిల్లర్‌గా మారే అవకాశమొస్తే మీ ఆయుధంగా ఏది ఎంచుకుంటారని ప్రశ్నించగా, చాకు లాంటి చిన్న ఆయుధాన్ని ఎంచుకుంటానని బదులిచ్చింది. ‘అదైతేనే ఎవరికీ కనిపించకుండా తేలికగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చ’ని చెప్పి నవ్వులు పూయించింది. తెరపై మీరు చూసిన బెస్ట్ విలన్ ఎవరని ప్రశ్నించగా.. సంజయ్ దత్ పేరు చెప్పింది. ఒత్తిడి సమయాల్లో ఎలాంటి ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతారని అడగ్గా.. ఇంటి భోజనమని బదులిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఎప్పుడైనా ఏదైనా డిష్ చేయడానికి ప్రయత్నించారా? అని ప్రశ్నించగా.. స్పానిష్ కాఫీ, కూల్ కాఫీ తయారు చేసినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ