Tollywood: సినీ తారాజువ్వలు.. టాలీవుడ్‌లో దీపావళి వేడుకలు షురూ

దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్‌లో పోస్టర్ల సందడి నెలకొంది. ఆయా చిత్రాల సరికొత్త పోస్టర్లతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Published : 24 Oct 2022 13:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాలీవుడ్‌లో దీపావళి సందడి మొదలైంది. స్టార్‌, యువ నటీనటులు నటించిన కొత్త చిత్రాల అప్‌డేట్స్‌తో నెట్టింట పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ మేరకు విడుదలైన విజయ్‌ ‘వారసుడు’, ధనుష్‌ ‘సార్‌’, రవితేజ ‘రావణాసురుడు’, ‘ధమాకా’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’, సమంత నటించిన ‘యశోద’ పోస్టర్లు సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక, వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ టీమ్స్‌ ప్రకటించగా.. ఇప్పుడదే జాబితాలోకి అఖిల్‌ నటించిన ‘ఏజెంట్‌’ వచ్చి చేరింది.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని