Tollywood: ‘ఓరి దేవుడా..!’, ‘డీజే టిల్లు’ గీతాలాపన.. ‘సెహరి’ తెర వెనక కథ!

‘డీజే టిల్లు’, ‘సెహరి’, ‘ఓరి దేవుడా’ చిత్ర బృందాలు విడుదల చేసిన వీడియోలు.  ఏ సినిమాలో ఎవరు హీరో అంటే....

Published : 08 Feb 2022 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు ‘డీజే టిల్లు’, ‘సెహరి’ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ రెండూ ఈ వారంలోనే సందడి చేయనున్నాయి. ఈ సందర్భంగా ఆ చిత్ర బృందాలు సర్‌ప్రైజ్‌లు అందించాయి. ‘ఓరి దేవుడా..!’ టీమ్‌ సైతం ప్రచారాన్ని షురూ చేసింది. అవేంటో చూసేయండి..

సిద్ధు పాడితే..

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్‌ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘డీజే టిల్లు’. నేహాశెట్టి కథానాయిక. సిద్ధు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘నువ్వులా’ గీతానికి సంబంధించి ఫుల్‌ వీడియో విడుదలైంది. సిద్ధు పాడిన ఈ గీతం శ్రోతల హృదయాల్ని హత్తుకునేలా ఉంది. ఈ పాటని రవికాంత్‌ పేరేపు రచించగా శ్రీచరణ్ పాకాల స్వరాలందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో ప్రిన్స్‌, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు విమల్‌తో కలిసి ఈ చిత్రానికి సిద్ధు స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రానికి సంభాషణలు: సిద్ధు, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సాయి ప్రకాశ్‌ ఉమ్మడిసింగు, కళ: అవినాష్‌ కొల్ల. ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

విశ్వక్‌ స్నేహగీతం..

విశ్వక్‌ సేన్‌, మిథిలా పాల్కర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓరి దేవుడా..!’. అశ్వత్‌ మరిముత్తు దర్శకుడు. ‘పాఠశాలలో’ అంటూ సాగే స్నేహగీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌, సమీర భరద్వాజ్‌ ఆలపించారు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ సినిమాను పీవీపీ సినిమా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి మాటలు: తరుణ్‌ భాస్కర్‌, కూర్పు: గ్యారీ బీహెచ్‌. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

సెహరి మేకింగ్ వీడియో

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రన్‌ చౌదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘సెహరి’. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో.. సినిమా షూటింగ్‌ ఎలా జరిగిందో తెలియజేసే ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. కొన్ని కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ ఈ వీడియోలో చూడొచ్చు. జిషురెడ్డి నిర్మించిన ఈ ఎంటర్‌టైనర్‌కి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని