DJ Tillu Review: రివ్యూ: డీజే టిల్లు
డీజే టిల్లు సినిమా ఎలా ఉందంటే..?
చిత్రం: డీజే టిల్లు; నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, తదితరులు; సినిమాటోగ్రఫీ: సాయిప్రకాశ్; ఎడిటర్: నవీన్ నూలీ; నేపథ్య సంగీతం: తమన్; నిర్మాత: సూర్యదేవర నాగవంశీ; సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్; కథ, రచన: విమల్ కృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ; దర్శకత్వం: విమల్ కృష్ణ; విడుదల తేదీ: 12-02-2022
పేరున్న నిర్మాణ సంస్థ నుంచి భారీ చిత్రాలే కాదు.. అప్పుడప్పుడు పరిమిత వ్యయంతో కూడిన సినిమాలూ వస్తుంటాయి. అలా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో రూపొందిన చిత్రమే ‘డీజే టిల్లు’. సిద్ధూ జొన్నలగడ్డ-నాగవంశీ కాంబినేషన్లో సినిమా మొదలైనప్పట్నుంచే ‘డీజే టిల్లు’ ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ప్రచార చిత్రాలు కూడా అందుకు దీటుగా ఉండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం..
కథేంటంటే: ఇంట్లో బాలగంగాధర్ తిలక్ అని పేరు పెడితే దాన్ని టిల్లుగా మార్చుకుని డీజే నిర్వహిస్తున్న ఓ యువకుడే.. కథానాయకుడు (సిద్ధూ జొన్నలగడ్డ). అందరూ డీజే టిల్లు అని పిలుస్తుంటారు. మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ అయిన రాధిక (నేహాశెట్టి)ని తొలిసారి చూడగానే ఇష్టపడతాడు. ఆమెకి తనదైన శైలిలో మాటలు చెబుతూ చెలిమి చేస్తాడు. ఇంతలో అనుకోకుండా రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో చెలిమి చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుపోయే పరిస్థితి వస్తుంది. దాంతో రాధిక చెప్పిందల్లా టిల్లు చేయాల్సి వస్తుంది. మరి ఆ హత్య కేసు నుంచి ఈ ఇద్దరూ బయటపడ్డారా? లేదా? ఇంతకీ హత్యకి గురైన వ్యక్తి ఎవరు? అదెలా జరిగింది?తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: క్రైమ్ నేపథ్యంలో సాగే ఓ కామెడీ కథ ఇది. కథానాయకుడి పాత్ర, అందులో అమాయకత్వం, సరదాతనం, వృత్తి.. ఈ సినిమాకి కొత్తదనాన్ని చేకూర్చాయి. కథలో యువతరాన్ని అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు ఆసక్తికరమైన కథనం వల్ల ఆరంభ సన్నివేశాలు పరుగులు పెడతాయి. ప్రేక్షకుడినీ వేగంగా కథలో లీనం చేస్తాయి. రాధికని ప్రేమలోకి దించాలనే ఆలోచనతో రంగంలోకి దిగిన డీజే టిల్లు అనుకోకుండా హత్యకేసులో ఇరుక్కుపోవడం.. దాంతో అతడిలో పొంగుకొచ్చే ఆవేశం.. అడుగడుగునా అనుమానాస్పదంగా కనిపించే రాధిక ప్రవర్తన.. ఆమెని నమ్మాలో లేదో తెలియని టిల్లు సందిగ్ధం.. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. నర్రా శ్రీనివాస్, బ్రహ్మాజీ, ప్రిన్స్.. ఇలా వరుసగా ఒక్కొక్క పాత్ర కథలోకి రావడంతో కథనం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రథమార్ధం వరకూ కథపరంగానూ, కామెడీపరంగానూ బలంగా కనిపించిన సినిమా ద్వితీయార్ధంలో మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. క్రమంగా కామెడీ తగ్గడం, చెప్పాల్సిన కథ కూడా లేకపోవడంతో సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. మెమరీ లాస్ అంటూ ద్వితీయార్ధంలో కథానాయకుడు చేసే హంగామా పెద్దగా మెప్పించదు. కోర్ట్ రూమ్‌లో హంగామా నవ్వించకపోగా, ఆ సన్నివేశాలు ఏమాత్రం హుందాగా అనిపించవు. కథానాయిక పాత్రని కూడా పూర్తిస్థాయిలో ఆవిష్కరించలేకపోయారు. కథానాయకుడి పాత్రలో ఉన్నంత బలం మిగతా పాత్రల్లోనూ కనిపించుంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది.
ఎవరెలా చేశారంటే: డీజే టిల్లుగా సిద్ధూ జొన్నలగడ్డ ఆకట్టుకున్నారు. ఆ పాత్రకి తగ్గ హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పిన సంభాషణలు నవ్వించడంతోపాటు, సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కథానాయిక నేహాశెట్టి అందంగా కనిపించడంతోపాటు, రాధికగా మంచి అభినయం ప్రదర్శించింది. బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితర హాస్యనటులున్నా వాళ్ల పాత్రలు సినిమాపై చూపించిన ప్రభావం తక్కువే. ప్రిన్స్ కథలో కీలకమైన పాత్రలో కనిపిస్తారు. సంగీతం సినిమాకి ప్రధానబలం. రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు సినిమాకి మరింత ఊపునిస్తాయి. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. దర్శకుడు విమల్ కృష్ణ ద్వితీయార్ధంపై పట్టుకోల్పోయినట్టు అనిపిస్తుంది. కథానాయకుడి పాత్రపై తప్ప ఇతర పాత్రలపై పెద్దగా కసరత్తులు జరిగినట్టు అనిపించదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కథానాయకుడిగానే కాకుండా, మాటల రచన బాధ్యతని కూడా భుజాన వేసుకున్న సిద్ధూ అందులోనూ ప్రభావం చూపించారు.
బలాలు
+ సిద్ధూ జొన్నలగడ్డ నటన, మాటలు
+ ప్రథమార్థం
+ సంగీతం
బలహీనతలు
- ద్వితీయార్ధం
- కొన్ని సంభాషణలు
చివరిగా: డీజే టిల్లు.. నవ్విస్తాడు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్‌ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్‌కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?