Samantha: సమంత ఆరోగ్యంపై కథనాలు.. ఆమె మేనేజర్‌ ఏమన్నారంటే

అగ్రకథానాయిక సమంత ఆరోగ్యం గురించి వస్తోన్న వార్తలపై ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు.

Published : 24 Nov 2022 10:57 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత (Samantha) ఆరోగ్యం గురించి వస్తోన్న వార్తలపై ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. సామ్‌ ఆరోగ్యంగానే ఉందని, ఆమె వైద్యశాలలో చేరినట్లు వస్తోన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని పేర్కొన్నారు. గత కొన్నిరోజుల నుంచి మయోసైటిస్‌ అనే అరుదైన రుగ్మతతో ఇబ్బందిపడుతోన్న సామ్‌.. ఉన్నట్టుండి గురువారం అనారోగ్యానికి గురయ్యారని, దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారని నెట్టింట పలు పోస్టులు దర్శనమిచ్చాయి. దీనిపై ఆందోళనకు గురైన ఆమె అభిమానులు ‘గెట్‌ వెల్‌ సూన్‌ సామ్‌’ అంటూ పోస్టులు పెడుతున్నారు. సామ్‌ టీమ్‌ని ట్యాగ్‌ చేస్తూ ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మేనేజర్‌ ఈ వార్తలను ఖండించాడు. ఆమె ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారని, ఆరోగ్యం కూడా బాగానే ఉందని చెప్పాడు. సినిమాల విషయానికి వస్తే సామ్ ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ ఇటీవల విడుదలై మంచి టాక్‌ అందుకొంది. ఈ సినిమా విడుదల సమయంలోనే సామ్‌.. తనకి ‘మయోసైటిస్‌’ అనే రుగ్మత ఉన్నట్లు వెల్లడించారు. దాని నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి

samantha: ‘మయోసైటిస్‌’ వ్యాధితో బాధపడుతున్నా.. త్వరలోనే కోలుకుంటా: సమంత

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts