Doctor G: ‘డాక్టర్‌’గా నవ్వులు పూయిస్తున్న ఆయుష్మాన్‌.. ట్రైలర్‌ ఇదిగో!

విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ బాలీవుడ్‌ తనదై ముద్ర వేసిన నటుడు ఆయుష్మాన్‌ ఖురానా . ఇప్పుడాయన ‘డాక్టర్‌ జీ’  సినిమా కోసం డాక్టర్‌గా మారారు.

Published : 20 Sep 2022 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ బాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలిచిన నటుడు ఆయుష్మాన్‌ ఖురానా (Ayushmann Khurrana). ఇప్పుడాయన ‘డాక్టర్‌ జీ’ (Doctor G ) సినిమా కోసం డాక్టర్‌గా మారారు. ఈ సినిమాని అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసింది. ఓ మహిళకు ఆయుష్మాన్‌ చెకప్‌ చేసే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పంచింది. ఇందులో ఆయుష్మాన్‌.. ఉదయ్‌ గుప్తగా కనిపించారు. వైద్య విద్యార్థి, వైద్యుడు.. ఇలా రెండు పాత్రల్లోనూ ప్రేక్షకులకు మంచి వినోదం అందించేలా ఉన్నారాయన. ఆర్థోపెడిక్స్‌ (ఎముకులకు సంబంధించి) చదవాలనుకున్న ఉదయ్‌ గుప్త (ఆయుష్మాన్‌)కు అనివార్య కారణంగా గైనకాలజీలో సీటు లభిస్తుంది. మరి, తనకు ఆసక్తిలేని విభాగంలో ఉదయ్‌ రాణించగలిగాడా, లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ కామెడీ-డ్రామా చిత్రంలో ఆయుష్మాన్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (rakul preeth singh) సందడి చేయనుంది. ఈ చిత్రానికి అనుభూతి కశ్యప్‌ దర్శకత్వం వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని