Samantha: సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్‌.. కానీ..

ఇటీవల సమంతను విమర్శించిన డాక్టర్‌ ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Updated : 06 Jul 2024 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమంతను విమర్శించినందుకు డాక్టర్‌ లివర్‌ డాక్‌ క్షమాపణలు చెప్పారు. కొన్ని రోజులుగా సమంతకు ఆయనకు మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆయన సమంత ఇచ్చిన హెల్త్‌ టిప్‌ను విమర్శించే క్రమంలో ఆమెను బలమైన పదాలతో దూషించారు. తాజాగా దీనిపై ఆయన సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. సమంతకు క్షమాపణలు చెప్పిన లివర్‌ డాక్‌.. ఆమెకు (Samantha) వైద్యం చేసే డాక్టర్‌ను మాత్రం తప్పుపట్టారు.

‘‘నేను సమంత ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆమె చెప్పిన హెల్త్‌ టిప్‌ను ఖండించిన తీరుకు ఆమె బాధపడ్డారు. ఇందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. అది అనుకోకుండా జరిగింది. ఆమెను విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఆమెకు ఆ చికిత్స చెప్పిన డాక్టర్‌ది తప్పు. ఆయన తన సొంత లాభం కోసం సమంత లాంటి సెలబ్రిటీల ద్వారా హనికరమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. దీన్ని నేను ఖండించాను’’ అని రాశారు.

డాక్టర్‌ వార్నింగ్‌పై స్పందించిన సమంత.. వాళ్ల కోసమే ఆలోచించానంటూ సుదీర్ఘ పోస్ట్

ఇక సమంతకు వైద్యం అందించే డాక్టర్‌ను లివర్‌ డాక్‌ తీవ్రంగా విమర్శించారు. ఆయనపై ఇప్పటికే పలుకేసులు ఉన్నట్లు చెప్పారు. ఆయన ఎంబీబీఎస్‌ చేసిన డాక్టర్‌ కాదని ప్రకృతి వైద్యుడన్నారు. గతంలోనూ ప్రజారోగ్యానికి హాని కలిగించే పలు ఉత్పత్తులను పోత్సహించినందుకు ఆయనపై ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని