Dongata: ఫహద్‌ ఫాజిల్‌ ‘దొంగాట’ ట్రైలర్‌

‘తనకో రూ.5వేలు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది’ అంటున్నాడు మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం

Published : 02 May 2022 20:13 IST

హైదరాబాద్‌:  ‘తనకో రూ.5వేలు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది’ అంటున్నాడు మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తొండిముతలం ద్రిక్షాక్షియుమ్‌’.2017లో విడుదలైన మలయాళం సినిమా అక్కడ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ‘దొంగాట’ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మహిళ మెడలో నుంచి దొంగతనం చేసిన గొలుసును ఫహద్‌ ఫాజిల్‌ తిరిగి ఇచ్చేశాడా? పోలీసులు ఏం చేశారు? చివరకు ఆ గొలుసు ఎలా బయటపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మలయాళంలో అనేక అవార్డులను అందుకున్న ఈ సినిమా ఉత్తమ మలయాళ చిత్రంగా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది.  మే 6వ తేదీ నుంచి  ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని