Updated : 21 Apr 2022 16:13 IST

RRR - Dosti Song: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’... ‘దోస్తీ’ ఫుల్‌ వీడియో వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నుంచి మరో ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. ‘దోస్తీ’ గీతాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన తీరు అందరినీ ఆకర్షించేలా ఉంది. విభిన్న ధృవాల మధ్య స్నేహం గురించి వివరించే ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా కాలభైరవ ఆలపించారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ‘నాటు నాటు...’, ‘కొమ్మా ఉయ్యాలా...’ పాటల ఫుల్‌ వీడియోలు యూట్యూబ్‌లో కోట్ల వీక్షణలు సొంతం చేసుకున్నాయి.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్‌ ఇండియా సినిమాలోని ఎన్టీఆర్‌, చరణ్‌ నటన యావత్‌ సినీ అభిమానుల్ని కట్టిపడేసింది. అల్లూరి సీతారామరాజు (నిప్పు) పాత్రలో రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌ (నీరు)గా తారక్‌ నట విశ్వరూపం చూపారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరిస్‌, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఇటీవల రూ.1000 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని