Dream Girl: ఈ తేదీకైనా వస్తుందా డ్రీమ్‌గర్ల్!
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డ్రీమ్‌గర్ల్’ విజయవంతమైన చిత్రంగా నిలిచింది.
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డ్రీమ్‌గర్ల్’ (Dream Girl) విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘డ్రీమ్ గర్ల్ 2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రాజ్ శాండిల్య దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్యాపాండే నాయికగా నటిస్తోంది. ఈ సినిమా విడుదల ముందుకి వెనక్కి వెళుతోంది. వచ్చే ఏడాది జూన్ 29న విడుదల అని చెప్పింది చిత్రబృందం. మళ్లీ ఒక వారం ముందుగా 23నే వచ్చేస్తున్నాం అని ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీలో కూడా రావడం లేదు. జులై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి చివరకి ఆ రోజునైన విడుదలవుతుందా? లేదా అనేది చూడాలి. ఆయుష్మాన్ ప్రస్తుతం ‘యాక్షన్ హీరో’ చిత్రంతో బిజీగా ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్‌లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు