Janhvi Kapoor: ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ ‘మిలీ’.. ‘దృశ్యం 2’ వచ్చింది కానీ!

జాన్వీకపూర్‌ ‘మిలీ’, అజయ్‌ దేవ్‌గణ్‌ ‘దృశ్యం 2’ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోందంటే?

Published : 30 Dec 2022 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) ప్రధాన పాత్ర పోషించిన ‘మిలీ’ (Mili) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ‘నెట్‌ఫ్లిక్స్‌’(Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ‘మీరు చేస్తున్న పనిని ఆపేసి, మిలీ కథను చూడండి’ అని సదరు సంస్థ సోషల్‌ మీడియాలో పేర్కొంది. మలయాళ సినిమా ‘హెలెన్‌’కు రీమేక్‌గా రూపొందిన ‘మిలీ’ నవంబరు 4న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మత్తుకుట్టి జేవియర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ టైటిల్‌ పాత్ర పోషించారు. అనుకోని పరిస్థితుల్లో మైనస్‌ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన ఓ యువతి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది? అన్న ఆసక్తికర కథాంశంతో రూపొందిన చిత్రమిది.

దృశ్యం 2 చూడాలంటే..?

తెరకెక్కిన అన్ని భాషల్లో సూపర్‌హిట్‌ అయిన చిత్రం ‘దృశ్యం’. మలయాళం, తెలుగులో ఎప్పుడో దానికి సీక్వెల్‌రాగా హిందీ ‘దృశ్యం 2’ (Drishyam 2) ఈ ఏడాది నవంబరులో విడుదలైంది. అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn), శ్రియ, టుబు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా థ్రిల్‌ పంచుతోంది. అయితే, అది సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారందరికీ కాదు. ఎవరైతే అద్దె చెల్లిస్తారో వారికి మాత్రమే. ఈ చిత్రాన్ని రెంట్‌కు అందుబాటులో ఉంచినట్టు ఓటీటీ సంస్థ వెల్లడించింది.అంటే.. ఈ సినిమాని చూడాలనుకునేవారు రూ. 199 చెల్లించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని