Drishyam: అంతర్జాతీయ భాషల్లో ‘దృశ్యం’ సినిమాలు

ఇప్పటికే పలు భాషల్లో రీమేక్‌గా తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి ‘దృశ్యం’ (Drishyam) సినిమాలు. ఇప్పుడు వీటిని విదేశీ భాషల్లోనూ రీమేక్‌ చేయనున్నారు. 

Published : 08 Feb 2023 16:01 IST

హైదరాబాద్‌: మలయాళంలో తెరకెక్కి, ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘దృశ్యం’ (Drishyam). దీనిని ఇప్పటికే పలు భాషల్లో రీమేక్‌ చేశారు. రీమేక్‌ చిత్రాలు కూడా సూపర్‌ హిట్‌గా నిలిచాయి. దీని కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం2’(Drishyam2) సినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమాలను అంతర్జాతీయ భాషల్లోకి రీమేక్‌ చేయనున్నారు. ఈ మేరకు ప్రొడక్షన్ హౌస్‌ వాళ్లు అధికారిక ప్రకటన చేశారు.

‘‘దృశ్యం2’ సినిమా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఈ చిత్రాన్ని విదేశీ భాషల్లో రీమేక్‌ చేయాలని నిర్ణయించాం. ఆంగ్లంతో సహా అన్ని విదేశీ భాషల్లో ‘దృశ్యం’, ‘దృశ్యం2’ సినిమాలు రీమేక్‌ చేయనున్నాం. చైనీస్‌ భాష రీమేక్‌ హక్కులను కూడా కొనుగోలు చేశాం. కొరియన్‌, జపాన్‌ భాషలకు సంబంధించి చర్చలు జరుపుతున్నాం’’ అని పనోరమా స్టూడియోస్‌(Panorama Studios) అధికారిక ప్రకటన చేసింది.

అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ కథ నేపథ్యంలో ‘దృశ్యం’ సినిమాలు తెరకెక్కాయి. మలయాళంలో మోహన్‌లాల్‌ (Mohan Lal) నటించగా, తెలుగులో వెంకటేష్ ‌(Venkatesh) కథానాయకుడు. ఈ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద రూ.240 కోట్లకు పైగా వసూళ్లు చేసిన విషయం తెలిసిందే. మలయాళంలో జీతూజోసెఫ్‌ (Jeethu Joseph) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు ఇప్పటి వరకు తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ రీమేక్‌ అయి ప్రేక్షకుల్ని మెప్పించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు