Drishyam: కొరియన్‌ భాషలో ‘దృశ్యం’

మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించిన చిత్రం ‘దృశ్యం’. దక్షిణ కొరియాకు చెందిన ఆంథాలజీ స్టూడియోస్‌తో కలిసి, పనోరమా స్టూడియోస్‌ ఈ సినిమాని కొరియన్‌ భాషలో రీమేక్‌ చేయనుంది.

Updated : 22 May 2023 14:16 IST

లయాళ, తెలుగు, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించిన చిత్రం ‘దృశ్యం’ (Drishyam). దక్షిణ కొరియాకు చెందిన ఆంథాలజీ స్టూడియోస్‌తో కలిసి, పనోరమా స్టూడియోస్‌ ఈ సినిమాని కొరియన్‌ భాషలో రీమేక్‌ చేయనుంది. ఈ వివరాల్ని ఆదివారం సినీవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కొరియన్‌ ‘దృశ్యం’లో ‘పారసైట్‌’ ఫేం సాంగ్‌ కాంగ్‌ హో కథానాయకుడిగా నటించనున్నారు. దీంతో కొరియన్‌ భాషలోకి రీమేక్‌ అవుతున్న తొలి చిత్రంగా ‘దృశ్యం’ నిలవనుంది. ‘‘దృశ్యం’ ఫ్రాంచైజీ చిత్రాలు కొరియన్‌ భాషలో పునర్నిర్మించడం పట్ల చాలా ఉత్సుకతతో ఉన్నా. దీంతో ఈ కథ ఎక్కువమంది ప్రేక్షకులకి చేరువ కావడమే కాదు.. హిందీ సినిమాని ప్రపంచ పటంలో నిలపనుంది’ అంటూ నిర్మాత కుమార్‌ మంగత్‌ పాఠక్‌ సంతోషం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు