Drishyam2: హిందీ ‘దృశ్యం2’ టీజర్ విడుదల...

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన దృశ్యం సినిమా పలు  భాషల్లోకి రీమేక్‌ అయ్యి విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం2’ కొన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.

Updated : 29 Sep 2022 15:03 IST

ఇంటర్నెట్ డెస్క్: మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘దృశ్యం’ సినిమా పలు భాషల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం2’ కొన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్‌దేవగణ్‌ ప్రధానపాత్రలో నటించారు. ఈ రోజు దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని అజయ్‌ తన ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఆయన ‘దృశ్యం2’ టీజర్‌ను పోస్ట్ చేస్తూ ‘విజయ్‌, అతడి కుటుంబ సభ్యులు మీ అందరికీ గుర్తున్నారు కాదా.. వారు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు’ అంటూ చిత్ర బృందాన్ని ట్యాగ్ చేశారు. నవంబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే అనేక పోస్టర్లను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో శ్రియ, టబు, అక్షయ్‌ ఖన్నా తదితరులు నటిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని