Aishwarya Rajesh: రయ్‌.. రయ్‌.. ‘డ్రైవర్‌ జమున’

నటనా ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తూ.. కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది ఐశ్వర్య రాజేష్‌. ఇప్పుడామె ‘డ్రైవర్‌ జమున’గా అలరించేందుకు సిద్ధమవుతోంది. పా.కిన్ల్సిన్‌

Updated : 06 May 2022 13:49 IST

నటనా ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తూ.. కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది ఐశ్వర్య రాజేష్‌. ఇప్పుడామె ‘డ్రైవర్‌ జమున’గా అలరించేందుకు సిద్ధమవుతోంది. పా.కిన్ల్సిన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఎస్‌.పి.చౌదరి నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ను నిర్మాత దిల్‌రాజు ఇటీవల విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ఐశ్వర్య ముఖంపై చెమటలు, రక్తం మరకలతో ఆసక్తికరంగా కనిపించారు. ‘‘ఓ లేడీ క్యాబ్‌ డ్రైవర్‌ జీవితంలో జరిగిన నాటకీయ సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఈ పాత్ర కోసం ఐశ్వర్య చాలా మంది లేడీ క్యాబ్‌ డ్రైవర్లని కలిసి.. వారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా నేచురల్‌గా ఈ పాత్రకు సిద్ధమయ్యారు. స్వయంగా రోడ్లపై కారు నడిపారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నాం’’ అని చిత్ర బృందం తెలిపింది. సంగీతం: జిబ్రాన్‌, కూర్పు: ఆర్‌.రామర్‌, ఛాయాగ్రహణం: గోకుల్‌ బెనోయ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని