Driver Jamuna: ‘డ్రైవర్‌ జమున’గా ఐశ్వర్య రాజేశ్‌.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్‌

ఐశ్వర్య రాజేశ్‌.. క్యాబ్‌ డ్రైవర్‌గా మారారు. కుటుంబాన్ని పోషించడానికి ధైర్యంగా ఆ వృత్తిని ఎన్నుకున్నారు. కస్టమర్‌ రూపంలో వచ్చిన ఓ రైడ్‌ ఆమె జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది.

Published : 07 Jul 2022 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh).. క్యాబ్‌ డ్రైవర్‌గా మారారు. ఓ చిత్రంలో కుటుంబాన్ని పోషించడానికి ధైర్యంగా ఆ వృత్తిని ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలో కస్టమర్‌ రూపంలో వచ్చిన ఓ రైడ్‌ ఆమె జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. ఊహించని ఆ ప్రమాదం నుంచి ఆమె ఎలా తప్పించుకున్నారు? ఆ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘డ్రైవర్‌ జమున’ (Driver Jamuna) సినిమా చూడాల్సిందే. ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. భీతి గొలిపే సన్నివేశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఐశ్వర్య రాజేశ్‌ చేసిన కార్‌ స్టంట్లు ఆశ్చర్యానికి గురిచేసేలా ఉన్నాయి. పీ కిన్‌స్లిన్‌ (P Kinslin) దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు జిబ్రాన్‌ (Ghibran) సంగీతం అందిస్తున్నారు. ఆడుకలం నరేన్‌, శ్రీ రంజని, స్టాండప్‌ కమెడియన్‌ అభిషేక్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో త్వరలోనే విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని