Salute: నేరుగా ఓటీటీలో దుల్కర్‌ సల్మాన్‌ ‘సెల్యూట్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

మలయాళంతో పాటు, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌.

Published : 08 Mar 2022 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళంతో పాటు, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan). ఇప్పటికే ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. తాజాగా రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో దుల్కర్‌ నటించిన చిత్రం ‘సెల్యూట్‌’ (Salute). ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌ వేదికగా మార్చి 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోనీలివ్‌ కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో దుల్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. మరి దుల్కర్‌కు ఎదురైన సమస్య ఏంటి? దాన్ని ఎలా పరిష్కరించాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని