veera simha reddy: వీరసింహారెడ్డి.. ఒక ఎమోషనల్‌ జర్నీ: దునియా విజయ్

వీరసింహారెడ్డి ప్రతినాయకుడిగా నటించిన కన్నడ నటుడు దునియా విజయ్‌ పంచుకున్న విశేషాలివే!

Published : 05 Jan 2023 18:21 IST

బాలకృష్ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ (veera simha reddy). శ్రుతిహాసన్‌ (shruti haasan) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు దునియా విజయ్‌ విలేకరులతో మాట్లాడారు. సినిమాకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.

ఇందులో విలన్‌ పాత్ర బలంగా ఉంటుంది!

‘‘వీరసింహారెడ్డి’ (veera simha reddy) కథలో నా పాత్ర గురించి గోపిచంద్‌ చెప్పగానే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇందులో ప్రతినాయకుడి పాత్ర ఒక పిల్లర్‌లా బలంగా ఉంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఇంత మంచి పాత్రలో అదీ బాలకృష్ణతో కలిసి నటించడం అదృష్టం. ఇందులో నేను ముసలిమడుగు ప్రతాప్ రెడ్డిగా కనిపిస్తా’’

ఫైట్స్‌ అదిరిపోతాయి!

‘‘ఈ చిత్రంలో పోరాటాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ప్రేక్షకులు ఆ ఎనర్జీని థియేటర్‌లో ఫీలవుతారు. ఇక బాలకృష్ణతో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను. పని పట్ల ఆయన ఎంతో అంకితభావంతో ఉంటారు. బాలకృష్ణను ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చూస్తున్నపుడు దేవుడు లాంటి మనిషి అనిపించింది. వీరసింహా రెడ్డి..అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ’’

మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా!

‘‘వీరసింహారెడ్డి’ (veera simha reddy) తర్వాత తెలుగులో మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక నటుడిగా అన్ని పాత్రలు చేయాలని ఉంది. నటన, దర్శకత్వం  రెండు వేరు వేరు. దర్శకుడిగా నటుల నుంచి యాక్టింగ్ రాబట్టుకోవాలి. నటుడిగా ఉన్నపుడు నా పని నటించడమే. ప్రస్తుతం ‘భీమా’ అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా.  తెలుగులో కూడా కొందరు సంప్రదించారు. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని