LYCA Productions: లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions)పై మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ (ED) అధికారులు నేడు లైకా సంస్థలో సోదాలు చేపట్టారు.

Updated : 16 May 2023 13:11 IST

చెన్నై: ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) దాడులు చేపట్టింది. చెన్నై (Chennai)లోని లైకా కార్యాలయం సహా ఆ సంస్థకు చెందిన మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో మంగళవారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఓ కేసులో ఈడీ (ED) అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల నుంచి లైకా సంస్థ ఎటువంటి ప్రకటనలు చేయలేదు.

బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన పొన్నియన్‌ సెల్వన్‌ 1, 2 (Ponniyin Selvan 1 and 2) చిత్రాలను లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన విషయం తెలిసిందే. వీటితో పాటు కత్తి, రోబో 2.0, దర్బార్‌ తదితర చిత్రాలు ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వచ్చాయి. ఈ సంస్థ నిర్మిస్తున్న ఇండియన్‌ 2, లాల్‌ సలామ్‌ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని