Ek mini katha: నవ్వులు పూయిస్తున్న ట్రైలర్‌

యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో  నటిస్తున్న చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. తాజాగా సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది.

Updated : 21 May 2021 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. తాజాగా సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. బ్రహ్మాజీ, హర్షవర్ధన్‌, సుదర్శన్‌, పోసాని, శ్రద్ధాదాస్‌, సప్తగిరి తదితరులు నటించారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, గోకుల్‌ భారతి సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఈ చిత్రం మే 27 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని