గిలిగింతలు పెడుతున్న ఏక్‌ మినీ కథ!

యువనటుడు సంతోష్‌శోభన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై కార్తీక్‌ రాపోలు తెరకెక్కించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. తాజాగా విడుదలైన సినిమా టీజర్‌ ప్రేక్షకులను

Published : 11 Mar 2021 13:33 IST

హైదరాబాద్‌: యువ నటుడు సంతోష్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై కార్తీక్‌ రాపోలు తెరకెక్కించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. తాజాగా విడుదలైన సినిమా టీజర్‌ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది. హీరోకి ఉన్న సమస్య ఏంటి? దాన్ని కప్పిపుచ్చడానికి అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? వంటి అంశాలకు హాస్యం జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.

బ్రహ్మాజీ, హర్షవర్థన్‌, సుదర్శన్‌, పోసాని, శ్రద్ధాదాస్‌ ప్రధాన పాత్రలలో నటించగా కావ్య థప్పర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటిదాకా ఈ టీజర్‌ చూసి ఆనందించండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని