MAA Elections: బ్యాలెట్‌ పద్ధతిలోనే ‘మా’ ఎన్నికలు: కృష్ణమోహన్‌

‘మా’ పోలింగ్‌పై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ వివరణ ఇచ్చారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే పోలింగ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ‘‘పోలింగ్‌ బ్యాలెట్‌ విధానంలోనే జరగాలని

Updated : 05 Oct 2021 19:17 IST

హైదరాబాద్‌: ‘మా’ పోలింగ్‌పై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ వివరణ ఇచ్చారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే పోలింగ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ‘‘పోలింగ్‌ బ్యాలెట్‌ విధానంలోనే జరగాలని మంచు విష్ణు లేఖ రాశారు. ఈవీఎం ద్వారా పోలింగ్‌ జరపాలని ప్రకాశ్‌రాజ్‌ కోరారు. విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్రతిపాదనలు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లాం. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కూడా బ్యాలెట్‌కే మొగ్గు చూపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాలెట్‌ పద్ధతిలోనే పోలింగ్‌ నిర్వహిస్తున్నాం. ఏపీ, తెలంగాణలో స్థానిక ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరిగాయి. 2019లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా బ్యాలెట్‌ పద్ధతిలోనే జరిగాయి’’ అని కృష్ణమోహన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని