Kangana: అస్సాంలో కంగనా సందడి
కంగనా రనౌత్ ముఖ్యభూమిక పోషిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. దీనికి రచయిత, నిర్మాత, దర్శకత్వం సైతం కంగనానే కావడం విశేషం. 1975-77 నాటి పరిస్థితుల ఆధారంగా నిర్మితమవుతోందీ సినిమా. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా కనిపించనున్నారు.
కంగనా రనౌత్ (Kangana Ranaut) ముఖ్యభూమిక పోషిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దీనికి రచయిత, నిర్మాత, దర్శకత్వం సైతం కంగనానే కావడం విశేషం. 1975-77 నాటి పరిస్థితుల ఆధారంగా నిర్మితమవుతోందీ సినిమా. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా కనిపించనున్నారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ అస్సాంలో జరుగుతోంది. తాజాగా రాత్రి నేపథ్యంగా వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని కంగనా ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. ఇందులో అనుపమ్‌ఖేర్, శ్రేయస్ తల్పడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.