Enemy: ఆ ఓటీటీలోకి.. విశాల్‌, ఆర్యల ‘ఎనిమి’

ఓటీటీలోకి ‘ఎనిమి’ చిత్రం. ఆర్య, విశాల్ కలిసి నటించిన సినిమా ఇది.

Published : 11 Feb 2022 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశాల్‌, ఆర్య హీరోలుగా కలిసి నటించిన చిత్రం ‘ఎనిమి’. గతేడాది నవంబరులో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతుంది. ‘సోనీ లివ్‌’లో ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ప్రాణానికి ప్రాణంగా ఉండే ఇద్దరు స్నేహితులు శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనే ఆసక్తికర పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్‌దాస్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, నేపథ్య సంగీతం: శ్యామ్‌ సీఎస్‌, కూర్పు: రేమాండ్‌ డేరిక్‌ క్రస్టా, ఛాయాగ్రహణం: ఆర్‌. డి. రాజశేఖర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని