Updated : 25 Jan 2022 19:26 IST

Akhanda: ‘అఖండ’ మేనియా.. ఊరంతా కలిసి సినిమా చూశారిలా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: థియేటర్‌లో రికార్డులు తిరగరాసిన బాలకృష్ణ ‘అఖండ’ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. బాలకృష్ణ నటనతో పాటు, దర్శకుడు బోయపాటి టేకింగ్‌, తమన్‌ మ్యూజిక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ‘అఖండ’ చూడటానికి ట్రాక్టర్లు వేసుకుని మరీ థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు.. ఇప్పుడు ఊరంతా కలిసి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కూనంనేనివారి పాలెంలో ‘అఖండ’ స్పెషల్‌ షో వేశారు. ఊరిలోని ఖాళీ ప్రదేశంలో పెద్ద తెరను, సౌండ్‌ బాక్సులను ఏర్పాటు చేసి, సినిమా ప్రదర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఒకప్పుడు పండగలకు, ఉత్సవాలకు గ్రామాల్లో ఇలాగే తెరలను కట్టి సినిమాలను ప్రదర్శించేవారనీ..  ‘అఖండ’ ఆనాటి రోజులను గుర్తు చేస్తోందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని