ETV 27th Anniversary: ఆగస్టు 28న ‘భలే మంచి రోజు’... వినోదాల విందు

ఆగస్టు 28 రాత్రిపూట 7.00 గంటలకు ఈటీవిలో ఆనందాల వేట ప్రారంభం కాబోతోంది.

Updated : 18 Aug 2022 14:13 IST

ఆగస్టు 28.. ఆదివారం

ఆనందాల హరివిల్లు విరబూస్తుంది..

వినోదాల విరిజల్లు కురుస్తుంది..

ఆనందాల నావపై ప్రేక్షక జగతి ఓలలాడుతుంది..

ఎందుకంటే... ఆగస్టు 27న తెలుగువారి ఇంటింటి టీవీ ఈటీవీ (etv) 27వ వసంతం (Etv 27th anniversary). ఆగస్టు 28 రాత్రిపూట 7.00 గంటలకు ఈటీవిలో ఆనందాల వేట ప్రారంభం కాబోతోంది. జబర్దస్త్ ద్వారా తెలుగునాట సుపరిచితులైన గ్లామర్ గాళ్ అనసూయ, మాటమాటలో చమక్కులు చిందించే చంద్ర, సుధీర్ వంటి పేరు... సుడిగాలి ఇంటిపేరుగా పెట్టుకున్న సుడిగాలి సుధీర్ మరల ఈటీవీ వేదికపై సందడి చేయబోతున్నారు. మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ నిర్వహించిన ఈ ఈవెంట్ ఆదివారం సాయంత్రం 7.00 గంటల నుంచి అందరిని అలరించబోతోంది.

నటి ఇంద్రజ, పాపులర్ యాంకర్ మాచిరాజు ప్రదీప్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈవెంట్లో జబర్దస్త్ ఆర్టిస్టులు రామ్ ప్రసాద్, హైపర్ ఆది వేసే పంచ్‌లు ప్రోగ్రామ్‌కి హైలెట్‌గా నిలవనున్నాయి. దేశంలోనే విఖ్యాత గాయకులైన కేజే ఏసుదాస్ తనయుడు విజయ్ ఏసుదాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌ ఆలపించిన గీతాలు తన్మయత్వంలో ఓలాలాడిస్తాయి. హాస్యనటులు ఆలీ, పోసానీ ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని టాక్. ఇంటిల్లిపాదిని ఆకట్టుకుని ఈటీవీ సీరియళ్లలోని నటీనటులు ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈటీవీ న్యూస్ ప్రజెంటర్లు న్యూ లుక్ లో సందడి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని