SV RangaRao: విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు స్పెషల్‌.. ఈవారం ‘వెండితెర వేల్పులు’

ఆయన ఓ చరిత్ర.. ఆయన ఓ వైభవం.. ప్రతినాయక ప్రతీక.. వెండితెర వెలుగు రేఖ.. ఆయనే తెలుగు జాతి ఆస్తి విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు (SV RangaRao). పౌరాణికం....

Updated : 30 Jun 2022 16:34 IST

హైదరాబాద్‌: ఆయన ఓ చరిత్ర.. ఆయన ఓ వైభవం.. ప్రతినాయక ప్రతీక.. వెండితెర వెలుగు రేఖ.. ఆయనే తెలుగు జాతి ఆస్తి విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు (SV RangaRao). పౌరాణికం, కమర్షియల్‌.. సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా.. ఆయన పరకాయ ప్రవేశం చేయనంతవరకే. ఒక్కసారి రంగప్రవేశం చేశారంటే ఆయన నటనకు పాత్రలే పరవశిస్తాయి. అహంకారం నుంచి ఘీంకారం వరకూ.. అనురాగం నుంచి అసూయ వరకూ ఆ కళ్లు పలికించని భావం, ఒలికించని రసమూ లేదు. భారతీయ సినిమా చరిత్రలో చిర యశస్వీ మన ఎస్వీ రంగారావు. ఆయన గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకునేందుకు ఈ వారం ‘వెండితెర వేల్పులు’ కార్యక్రమం సిద్ధమైంది. ‘విశ్వనట చక్రవర్తి ఎస్వీరంగారావు’ స్పెషల్‌ ఎపిసోడ్‌ ‘ఈటీవీ’ వార్త ఛానళ్లలో ఈ ఆదివారం ఉదయం 10.30 గంటలకు, రాత్రి 10.30 గంటలకు ప్రసారం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని