Sudheer Rashmi: పెళ్లి ముచ్చ‌ట‌.. నవ్వులే నవ్వులు

‘ప్ర‌పంచానికి మ‌న‌ల్ని చూపించేది అమ్మ అయితే ప్ర‌పంచాన్నే మ‌న‌కు చూపించేది నాన్న’  అని నాన్న గొప్ప‌త‌నం తెలియ‌జేశాడు సుధీర్.

Updated : 15 Jun 2021 18:54 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘ప్ర‌పంచానికి మ‌న‌ల్ని చూపించేది అమ్మ అయితే ప్ర‌పంచాన్నే మ‌న‌కు చూపించేది నాన్న’ అని నాన్న గొప్ప‌త‌నం తెలియ‌జేశాడు సుధీర్. ఈ ఆదివారం (జూన్ 20) ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా ‘శ్రీ దేవీ డ్రామా కంపెనీ’ కార్య‌క్ర‌మంలో నాన్నకు ప్రేమ‌తో అనే ఎపిసోడ్‌ని రూపొందించాడు. త‌మ తండ్రితో క‌లిసి ఈ షోకి విచ్చేశారు బుల్లెట్ భాస్క‌ర్‌, నూక‌రాజు, న‌రేశ్ త‌దిత‌రులు. నాన్న‌తో వాళ్ల‌కి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ష్మిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌? అని బుల్లెట్ భాస్క‌ర్ తండ్రి సుధీర్‌ను అడగ‌టం స‌ర‌దాగా సాగింది. నూక‌రాజు, ఆదిల అల్ల‌రి న‌వ్వులు పూయిస్తుంది. ముఖ్య అతిథిగా వ‌చ్చిన న‌టి ఇంద్ర‌జ డ్యాన్సు అల‌రిస్తోంది. మ‌రి ఈ హంగామా అంతా చూడాలంటే ఆదివారం వ‌ర‌కు ఆగాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రోమో చూసి ఆనందించండి...

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని