ETV Win: ఈటీవీ విన్‌ కొత్త వెబ్‌సిరీస్‌ ప్రారంభం

హర్ష రోషన్, భానుప్రతాప్, సింధూ రెడ్డి, జయతీర్థ ప్రధాన పాత్రల్లో జోసెఫ్‌ క్లింటన్‌ తెరకెక్కిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘ఏఐఆర్‌’. ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌.. అన్నది ఉపశీర్షిక.

Updated : 24 Jun 2024 01:05 IST

ర్ష రోషన్, భానుప్రతాప్, సింధూ రెడ్డి, జయతీర్థ ప్రధాన పాత్రల్లో జోసెఫ్‌ క్లింటన్‌ తెరకెక్కిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘ఏఐఆర్‌’. ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌.. అన్నది ఉపశీర్షిక. దర్శకుడు సందీప్‌రాజ్‌ షో రన్నర్‌గా ఉన్న ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో విడుదల కానుంది. దీన్ని బై పాకెట్‌ మనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌ ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్‌ ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌ పోస్టర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. వినోదం, డ్రామాతో పాటు బలమైన భావోద్వేగాలున్న కథతో ఈ సిరీస్‌ రూపొందనున్నట్లు అర్థమవుతోంది’’ అన్నారు. ‘‘ఇదొక థ్రిల్లింగ్‌ కథాంశంతో రూపొందనుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సిరీస్‌ అవుతుంద’’ని ఈ సిరీస్‌ రూపకర్తలు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని