కేజీఎఫ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టిల్‌ చూశారా..?

సినిమా అభిమానులకు కేజీఎఫ్‌ స్టార్‌ హీరో ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కేజీఎఫ్‌  ఛాప్టర్‌ చివరి షెడ్యుల్‌లో భాగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈక్రమంలో హీరో యశ్‌ ‌ సినిమాలోని ఓ స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘అన్ని మంచి విషయాలు

Published : 08 Dec 2020 00:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా అభిమానులకు కేజీఎఫ్‌ స్టార్‌ హీరో ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కేజీఎఫ్‌  ఛాప్టర్‌ చివరి షెడ్యుల్‌లో భాగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈక్రమంలో హీరో యశ్‌ ‌ సినిమాలోని ఓ స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘అన్ని మంచి విషయాలు ఎప్పుడో ఒకసారి ముగిసిపోతాయి. ఇది కూడా చివరి షెడ్యుల్‌ కావచ్చు. కానీ.. విలన్‌ ఎప్పటికీ ఉంటాడు.. నా అభిమానుల కోసం కేజీఎఫ్‌2 నుంచి ఒక ప్రత్యేకమైన స్టిల్‌’ అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశాడు.

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ ఘన విజయం సాధించింది. దీంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌2’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ.. కరోనా.. వల్ల అది కుదరలేదు. అయితే.. లాక్‌డౌన్‌ తర్వాత పునఃప్రారంభమైన షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్‌ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది.

ఇదీ చదవండి

సీత వచ్చేసింది.. క్లైమాక్స్‌ మొదలైంది..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని