EXTRACTION 2: యాక్షన్‌ ప్రియులను అలరించేలా ‘ఎక్స్‌ట్రాక్షన్‌2’ వచ్చేస్తోంది

క్రిస్‌ హేమ్స్‌ వర్త్‌ కథానాయకుడిగా నటించిన ‘ఎక్స్‌ట్రాక్షన్‌2’ తెలుగు ట్రైలర్‌ విడుదలై అలరిస్తోంది.

Published : 17 May 2023 12:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నా జీవితంలో నన్ను పోరాడమని చెప్పావు కదా. ఆ పనే చేస్తున్నా’ అంటున్నారు క్రిస్‌ హేమ్స్‌ వర్త్‌ (Chris Hemsworth). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఎక్స్‌ట్రాక్షన్‌2’ (Extraction 2). 2020లో వచ్చిన ‘ఎక్స్‌ట్రాక్షన్‌’కు కొనసాగింపుగా ఈ సినిమాను సామ్‌ హర్‌గ్రేవ్‌ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 16న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఇంగ్లిష్‌తో పాటు, హిందీ, తెలుగు, తమిళ, భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. మొదటి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. అవెంజర్స్‌లో ‘థోర్’ పాత్రలో నటించి అలరించిన హేమ్స్‌ వర్త్‌ ఇందులో యాక్షన్‌ మోడ్‌లో అదరగొట్టాడు. మరి టేలర్‌ (హేమ్స్‌ వర్త్‌) ఏ మిషన్‌ కోసం రంగలోకి దిగాడు? అందులో విజయం సాధించాడా? లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని