రవితేజ కుటుంబం నుంచి మరో హీరో.. ఏయ్‌ పిల్లా..!

కథానాయకుడు రవితేజ కుటుంబం నుంచి మరో వ్యక్తి హీరోగా రాబోతున్నాడు. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్‌ భూపతిరాజు త్వరలోనే వెండితెరపై సందడి చేయనున్నారు.

Updated : 15 Aug 2022 11:23 IST

హైదరాబాద్‌: కథానాయకుడు రవితేజ కుటుంబం నుంచి మరో వ్యక్తి హీరోగా రాబోతున్నాడు. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్‌ భూపతిరాజు త్వరలోనే వెండితెరపై సందడి చేయనున్నారు. అతడిని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్న ఆ చిత్రానికి ‘ఏయ్... పిల్లా’అనే టైటిల్ ఖరారు చేశారు. మరో విశేషం ఏంటంటే, మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ ఇందులో కథానాయిక. సెప్టెంబర్ నుంచి ‘ఏయ్... పిల్లా’ సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునే విధంగా, 90వ దశకం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని