Updated : 28 May 2022 05:06 IST

F 3: అన్ని చోట్లా ఒకే మాట వినిపిస్తోంది.. విజయోత్సాహంలో ‘ఎఫ్‌ 3’ టీమ్‌

హైదరాబాద్‌: తమ సినిమాకు వస్తోన్న స్పందనపై ‘ఎఫ్‌ 3’ (F 3) చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ‘ఎఫ్‌ 2’కి మించిన విజయాన్ని అందించారంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. సునీల్‌, సోనాల్‌ చౌహాన్‌, ప్రదీప్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుందని తెలియజేస్తూ చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. కథానాయకులు, దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.

ఎఫ్‌ 2 తర్వాత ఇదే.. 

‘‘కొవిడ్‌ తర్వాత థియేటర్లలో విడుదలైన సినిమాలకు యూత్‌, మాస్‌ ఆడియన్స్‌ మాత్రమే వస్తున్నారనే టాక్‌ వినిపించింది. కుటుంబ ప్రేక్షకులనూ థియేటర్లకు తీసుకురావాలనే లక్ష్యంతోనే ‘ఎఫ్‌ 3’ను రూపొందించాం. అనుకున్నట్టుగానే మంచి విజయం అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ‘ఎఫ్‌ 2’ తర్వాత నేను థియేటర్‌లో చూసిన చిత్రమిదే. నేను వెళ్లిన దేవి థియేటర్‌లోని ప్రేక్షకుల స్పందన చూసి ఎంతో ఆనందించా. ఇలాంటి అద్భుతమైన ఔట్‌పుట్‌ను అందించేందుకు మేమంతో కష్టపడ్డాం. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ చూసి, ఎంజాయ్‌ చేస్తారని’’ ఆశిస్తున్నా అని వెంకటేష్‌ (Venkatesh) అన్నారు.

అందరి నోట ఇదే మాట

‘‘ఎఫ్‌ 3’ చూసిన వారంతా ‘సూపర్‌ ఎక్ట్స్రార్డనరీ అదిరిపోయిందిగా..’ అని చెప్పడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలకు థ్యాంక్స్‌. మా కాంబినేషన్‌ (వెంకటేశ్‌- వరుణ్‌)కు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తే చాలా హ్యాపీగా ఉంది’’ అని వరుణ్‌తేజ్‌ (Varun Tej) పేర్కొన్నారు.

హ్యాట్రిక్‌..

‘‘మా బ్యానర్‌లో.. వెంకటేశ్‌ గతంలో నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్‌ 2’, వరుణ్‌తేజ్‌ నటించిన ‘ఫిదా’, ‘ఎఫ్‌ 2’ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’ హ్యాట్రిక్‌గా నిలిచింది. మాస్‌, క్లాస్‌, యూత్‌, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. అమెరికా, లండన్, రాయలసీమ, కోస్తా, నైజాం.. ఇలా అన్ని చోట్లా విజయాన్ని అందించారు. వెంకటేశ్‌, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా ప్రయాణం విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని దిల్‌రాజు (Dil Raju) తెలిపారు.

ఈ ప్రయాణం కొనసాగాలని..

‘‘ఎఫ్‌ 3’ విషయంలో ‘ఎనీ సెంటర్‌ సింగిల్‌ టాక్‌ బ్లాక్‌ బ్లస్టర్‌’ అనే మాటే వినిపిస్తోంది. ‘ఎఫ్ 2’కి మించిన ఆదరణ దక్కుతుండటం ఆనందంగా ఉంది. ఈ రెండేళ్ల ప్రయాణంలో మేమంతా ఓ కుటుంబంలా మారిపోయాం. వెంకటేశ్‌ సర్‌కి బిగ్ థ్యాంక్స్. స్టార్ ఇమేజ్‌ పక్కనపెట్టి కామెడీ రోల్‌ పండించడం మామూలు విషయం కాదు. వరుణ్ తేజ్ చక్కగా నటించారు. వీరితో ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా. హాయిగా నవ్వుకునే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఫ్యామిలీతో కలిసి ఈ చిత్రాన్ని చూసి నవ్వుకోండి’’ అని అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) అన్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని