‘ఎఫ్‌2’ చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎఫ్‌2’ చిత్రానికి జాతీయస్థాయి అవార్డు వరించింది. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం ఇండియన్‌ పనోరమ అవార్డు సొంతం చేసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాదికిగాను...

Published : 22 Oct 2020 01:09 IST

జాబితా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎఫ్‌2’ చిత్రానికి జాతీయస్థాయి అవార్డు వరించింది. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం ఇండియన్‌ పనోరమ అవార్డు సొంతం చేసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాదికిగాను ఉత్తమ ఫీచర్‌ ఫిలిం విభాగంలో తెలుగు నుంచి ‘ఎఫ్‌2’ మాత్రమే అవార్డును సొంతం చేసుకుంది. మరోవైపు ‘ఉరి’, ‘సూపర్‌ 30’, ‘గల్లీబాయ్‌’ చిత్రాలు బాలీవుడ్‌ నుంచి పనోరమ అవార్డును కైవసం చేసుకోగా.. తమిళం నుంచి ‘హౌస్‌ ఓనర్’‌, మలయాళం నుంచి ‘జల్లికట్టు’ చిత్రాలు సైతం ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నాయి. 

అవార్డులు గెలుపొందిన చిత్రాలు

తెలుగు

ఎఫ్‌2 - అనిల్‌ రావిపూడి

హిందీ

గల్లీబాయ్‌-జోయా అక్తర్‌

ఉరి-ఆదిత్య

సూపర్‌ 30-వికాశ్‌

పరీక్ష-ప్రకాశ్‌ ఝా

72 హురైన్‌-సంజయ్‌ పురాన్‌

బదాయ్‌ హో- అమిత్‌ శర్మ

తమిళం

హౌస్‌ ఓనర్‌ - లక్ష్మి రామకృష్ణన్‌

ఓత్తా సెరుప్పు సైజ్‌ 7 - రాధాకృష్ణన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని