Published : 22 May 2022 13:45 IST

F2 vs F3: స్టేజ్‌పై అదరగొట్టేసిన వెంకీ మామ, వరుణ్‌ తేజ్‌..

హైదరాబాద్‌: సమ్మర్‌ సోగ్గాళ్లుగా ఈ వేసవిలో నవ్వులు పూయించేందుకు సిద్ధమయ్యారు వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌. ఈ ఇద్దరూ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్‌ ‘ఎఫ్‌-3’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. తమన్నా, మెహ్రీన్‌ కథానాయికలు. 2019లో విడుదలై ఫన్‌ఫుల్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్న ‘ఎఫ్‌-2’కి కొనసాగింపుగా ఈ సినిమా సిద్ధమైంది. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా శనివారం సాయంత్రం ‘ఎఫ్‌-3’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్‌.. తన బ్రాండ్‌ మూకీ స్కిట్‌ చేసి అందర్నీ నవ్వించారు. ఇక, ‘ఎఫ్‌-2 వర్సెస్‌ ఎఫ్‌-3’ పేరుతో సాగిన ఓ సెగ్మెంట్‌లో వరుణ్‌తేజ్‌, వెంకటేశ్‌, ఇతర చిత్రబృందం రెండు టీమ్‌లుగా విడిపోయి నాన్‌స్టాప్‌ ఫన్‌ అందించారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌.. సినిమాల్లోని డైలాగ్స్‌, సాంగ్స్‌ ప్లే చేసి వాటికి రీల్స్‌ చేయాలని, గెలిచిన టీమ్‌కి గిఫ్ట్‌ ఇస్తామని సుమ చెప్పడంతో వెంకీ, వరుణ్‌ జట్లు సరదాగా పోటీ పడ్డాయి. వెంకీ కామెడీ టైమింగ్‌కి ఫ్యాన్స్‌ అదుర్స్‌ అంటూ ప్రశంసిస్తున్నారు. మీరూ ఓసారి ఆ వీడియోలు చూసేయండి..!



Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని