Updated : 05 Jul 2022 19:11 IST

F3: ప్రపంచవ్యాప్తంగా రూ.134కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న ‘ఎఫ్‌3’

హైదరాబాద్‌: వెంకటేశ్‌(Venkatesh), వరుణ్‌తేజ్‌(Varun tej) కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్‌3’(F3). తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. వేసవి కానుకగా మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ థియేటర్‌లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.134 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ల కామెడీ టైమింగ్‌, అనిల్‌ రావిపూడి టేకింగ్‌ సినిమాను విజయపథంలో నడిపాయి. కాగా, సినిమా విడుదలై ఏడు వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర నిర్మాతలు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని