F3: ఎఫ్‌3 ‘అహ..అహ..’ పాట విన్నారా...

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా ఈ వేసవిలో రానున్న చిత్రం ‘ఎఫ్‌3’. ఈ సినిమాలోని  ‘ఊ...ఆ.. అహ...అహ..’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 22 Apr 2022 10:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా ఈ వేసవిలో రానున్న చిత్రం ‘ఎఫ్‌3’. ఈ సినిమాలోని  ‘ఊ...ఆ.. అహ...అహ..’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్న ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాశారు. సునిధి చౌహాన్‌, లవిత లోబో, సాగర్‌, ఎస్‌.పి అభిషేక్‌లు అలపించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌2’కి కొనసాగింపుగా వస్తోన్న ఈ సినిమాలో సమ్మర్‌ సోగ్గాళ్ల సరసన తమన్నా ,మెహ్రీన్‌ కథానాయికలుగా నటించారు. దిల్‌ రాజు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని