Published : 24 Feb 2022 14:45 IST

Bheemla Nayak: ‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌.. కళాశాలకు హాలీడే.. స్పందించిన ఏపీ ప్రభుత్వ విభాగం

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్‌ మేనియా మొదలైపోయింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లానాయక్‌’ శుక్రవారం రిలీజ్‌ కానున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. మొదటిరోజే తమ అభిమాన హీరో సినిమా చూడాలనుకుంటున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కళాశాలలు ఉండటం వల్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షోకు వెళ్లలేకపోతున్నామని పలువురు విద్యార్థులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఓ ప్రకటన నిన్నటి నుంచి వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. విద్యార్థుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ‘భీమ్లానాయక్‌’ విడుదల సందర్భంగా శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సెలవు ప్రకటిస్తున్నట్లు అందులో ఉంది. ఇది నిజమా? కాదా? అని పలువురు విద్యార్థులు సందేహం వ్యక్తం చేయగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించిన ‘ఫ్యాక్ట్‌చెక్‌’ సెల్‌ అది అబద్ధమని తేల్చేసింది. ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘కొత్త సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించినట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సెలవుని ప్రకటిస్తూ మేము అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఆ ప్రకటన అవాస్తవం మాత్రమే’’ అని తెలిపారు. ఈ విషయాన్ని FACTCheck.AP.Gov.in ట్వీట్‌ చేసింది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని