fahad fazil: ఫహాద్‌ ఫాజిల్‌.. లోకేశ్‌తో మరోసారి?

‘లియో’ విజయం తర్వాత దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ రూపొందించనున్న కొత్త చిత్రం ‘కూలీ’. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

Updated : 14 Jun 2024 08:25 IST

లియో’ విజయం తర్వాత దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ రూపొందించనున్న కొత్త చిత్రం ‘కూలీ’. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడీ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం ఫహాద్‌ ఫాజిల్‌ను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఫహాద్‌ ఇప్పటికే లోకేశ్‌ దర్శకత్వంలో ‘విక్రమ్‌’లో నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు మరోసారి అలాంటి శక్తిమంతమైన పాత్రనే ఈ చిత్రంలో తన కోసం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ చిత్ర విషయమై ఫహాద్‌తో సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. జులై తొలి వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అనిరుధ్‌ సంగీతమందిస్తుండగా.. గిరీష్‌ గంగాధరన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని