Fahadh Faasil: ఫహద్‌ ఫాజిల్‌ అదరగొట్టేశాడు!

మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘ట్రాన్స్‌’. గతేడాది మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా

Published : 28 Jun 2021 19:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘ట్రాన్స్‌’. గతేడాది మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఫహద్‌ ఫాజిల్‌ నటన విమర్శకులను సైతం మెప్పించింది. కన్యాకుమారికి చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడైన విజు ప్రసాద్‌(ఫహద్‌ ఫాజిల్‌) కార్పొరేట్‌ సంస్థలో చేరి ఎలా పాస్టర్‌ అయ్యాడు? తన మాటలతో ప్రజలను ఎలా మభ్యపెట్టాడు? కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు? చివరకు ఆ కార్పొరేట్‌ కుట్రలకు ఎలా బలయ్యాడు? అన్నదే ఈ చిత్ర కథ. కాగా, తెలుగులో ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఇక్కడి వారినీ ఫహద్‌ నటన ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాలో ఓ సన్నివేశాన్ని ‘ఆహా’ అభిమానులతో పంచుకుంది. ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని