Malik: ఫహద్‌ ఫాజిల్‌ ‘మాలిక్‌’.. ఆ ఓటీటీలో తెలుగు వెర్షన్‌

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘మాలిక్‌’ (Malik).

Published : 28 Jul 2022 19:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘మాలిక్‌’ (Malik). మహేశ్‌ నారాయణన్‌ దర్శకుడు. కరోనా కారణంగా గతేడాది ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా రెండు భిన్న పార్శ్వాల్లో ఫహద్‌ ఫాజిల్‌ నటన సినిమాకే హైలైట్‌. ఈ సినిమాను తెలుగులో చూద్దామని భావించిన ప్రేక్షకులకు అప్పుడు నిరాశే ఎదురైంది.  అలాంటి వారందరికీ తెలుగు ఓటీటీ ‘ఆహా’ తీపి కబురు చెప్పింది. ‘మాలిక్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, టీజర్‌ను సైతం విడుదల చేసింది. ఆగస్టు 12 ఆహా ఓటీటీ వేదికగా ‘మాలిక్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. ఫహద్‌ ఫాజిల్‌తో పాటు నిమిషా సంజయన్‌, వినయ్‌ ఫోర్ట్‌, జోజూ జార్జ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కథేంటంటే: అలీ అహ్మద్‌ సులేమాన్‌ మాలిక్‌ (ఫహద్‌ ఫాజిల్‌) కేరళలోని రందాన్‌పల్లి అనే సముద్రతీర ప్రాంతానికి గ్యాంగ్‌స్టర్‌. ఆ ప్రాంతంలో ఆయన మాటే శాసనం. ఆఖరికి పోలీసులు, రాజకీయ నాయకులు కూడా ఆయన మాట వినాల్సిందే. అదే సమయంలో కేరళ తుపాను బాధితులకు ఇళ్లు, ఇతర సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంటుంది. స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు.. తుపాను బాధితుల ఇళ్ల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులతో కలిసి కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ నిర్మించాలనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న సులేమాన్‌.. రాజకీయ నాయకులను హెచ్చరిస్తాడు. తమ పనికి సులేమాన్‌ అడ్డు వస్తున్నాడని భావించిన వాళ్లు.. ఏళ్ల క్రితం జరిగిన ఓ మత ఘర్షణ కేసును రీ ఓపెన్‌ చేసి.. హజ్‌ యాత్రకు వెళ్లాలనుకున్న సులేమాన్‌ని జైలుకి పంపిస్తారు. జైల్లోనే అతడిని చంపేయాలని ప్లాన్‌ చేస్తారు. ఇంతకీ వారి ప్లాన్‌ ఏమైంది? రందాన్‌పల్లికి ఆయన ఎలా మాలిక్‌ అయ్యాడు? మాలిక్‌గా మారే క్రమంలో అతడు తన జీవితంలో ఏం కోల్పోయాడన్నది మిగిలిన కథ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని