bollywood: 22 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి ప్రముఖ నటి.. ఎవరంటే?

ప్రముఖ నటి 22 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆమె ఎవరు? ఆ ప్రాజెక్టు ఏంటంటే?

Published : 15 May 2023 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెరంగేట్రం చేసిన అనతికాలంలోనే స్టార్‌ నాయికగా మారిన నటి.. జ్యోతిక (Jyothika). 1998లో మొదలైన తన ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇతర భాషల్లో పెద్దగా నటించకపోయినా తమిళ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్నారామె. ఓ వైపు నాయికా ప్రాధాన్య సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతరుల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా హిందీ సినిమాలో కీ రోల్‌ ప్లే చేసే అవకాశం దక్కించుకున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌ (ajay devgn), మాధవన్‌ (madhavan) హీరోలుగా దర్శకుడు వికాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. టైటిల్‌ ఖరారుకాని ఆ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది జూన్‌లో ప్రారంభంకానుంది.

‘డోలీ సజాకే రఖ్‌నా’.. ఈ హిందీ సినిమాతో నటిగా కెరీర్‌ని ప్రారంభించిన జ్యోతిక తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. రెండో సినిమా ‘వాలి’ (తమిళ్‌)తో విశేష క్రేజ్‌ సంపాదించారు. హిందీలో ఆమె నటించిన రెండో సినిమా, చివరి సినిమా ‘లిటిల్‌ జాన్‌’. సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం 2001లో విడుదలైంది. ‘ఠాగూర్‌’, ‘మాస్‌’, ‘షాక్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారామె. కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించిన ఆమె.. తన భర్త, ప్రముఖ హీరో సూర్య (suriya)తో కలిసి ‘2డీ ఎంటర్‌టైనర్‌మెంట్‌’ పతాకంపై సినిమాలు నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని