చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ కన్నుమూత

చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, ప్రొడెక్షన్‌ డిజైనర్‌ సునీల్‌ బాబు (Sunil Babu) (50) హఠాన్మరణం చెందారు..

Updated : 06 Jan 2023 17:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, ప్రొడెక్షన్‌ డిజైనర్‌ సునీల్‌ బాబు (Sunil Babu) (50) హఠాన్మరణం చెందారు. గురువారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కేరళలోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో మలయాళీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతూ దుల్కర్‌ సల్మాన్‌, హను రాఘవపూడి, వైజయంతి మూవీస్‌ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. మలయాళీ పరిశ్రమలో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు సునీల్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం ఆయన తెలుగు, తమిళం, హిందీ చిత్రాలకూ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ‘సీతారామం’, ‘ఎం.ఎస్‌.ధోనీ’, ‘లక్ష్యం’, హిందీలో వచ్చిన ‘గజిని’తోపాటు విడుదలకు సిద్ధంగా ఉన్న ‘వారిసు’కు సైతం ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని