Director Sagar: సీనియర్‌ దర్శకుడు సాగర్‌ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ దర్శకుడు సాగర్‌ (Sagar) తుదిశ్వాస విడిచారు. సాగర్‌ పూర్తి పేరు విద్యాసాగర్‌ రెడ్డి.

Updated : 02 Feb 2023 12:06 IST

చెన్నై: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు సాగర్‌ (Sagar) (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన చెన్నైలోని నివాసంలో  తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సాగర్‌ అనుకోని విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘రాకాసి లోయ’తో మొదటిసారి దర్శకుడిగా అడుగులు వేశారు. ఆ తర్వాత ‘స్టూవర్టుపురం దొంగలు’, ‘ఓసి నా మరదలా’, ‘రామసక్కనోడు’, ‘అమ్మదొంగ’ చిత్రాలకు ఆయన దర్శకుడిగా పనిచేశారు. అంతేకాకుండా తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని