Samantha: ‘సామ్.. మళ్లీ ప్రేమలో పడొచ్చుగా..!’ నెటిజన్ ట్వీట్‌కు సామ్ సమాధానం ఏమిటంటే..?
‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు నటి సమంత (Samantha). ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్.. సామ్‌ను మళ్లీ ప్రేమలో పడమంటూ సూచించింది.
హైదరాబాద్: వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్నారు నటి సమంత (Samantha). నాగచైతన్య నుంచి విడిపోవడం.. ఆ బాధ నుంచి బయటపడేలోపే మయోసైటిస్ బారిన పడటం.. ఇలా ఒక దాని తర్వాత మరొకటి ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సామ్ కొత్త జీవితం ప్రారంభిస్తే చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె మళ్లీ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టాలని ఆశిస్తున్నారు. ఈ విషయం గురించే ఓ నెటిజన్ ప్రశ్నించగా.. సామ్ ఇచ్చిన సమాధానం అభిమానుల మనసు దోచేస్తోంది.
‘శాకుంతలం’ (Shaakuntalam) ప్రమోషన్స్‌లో భాగంగా ట్విటర్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉన్న సమంతకు తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ చేసింది. ‘‘నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదని నాకు తెలుసు.. కానీ, మీరు మళ్లీ ఎవరినైనా ప్రేమించొచ్చు కదా’’ అంటూ నెటిజన్ ప్రశ్నించగా దానిపై సామ్ స్పందించారు. ‘‘మీరు ప్రేమించినంతగా నన్ను మరెవరు ప్రేమించగలరు?’’ అంటూ లవ్ సింబల్‌ని జత చేస్తూ ఇచ్చిన రిప్లై నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఆమె చెప్పిన సమాధానంపై వాళ్లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏడేళ్ల పాటు ప్రేమించుకుని కుటుంబసభ్యుల అంగీకారంతో 2017లో సామ్- చైతన్య వివాహం చేసుకున్నారు. టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటగా ఫేమ్ సొంతం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో 2021లో విడిపోతున్నట్లు ప్రకటించి.. అందర్నీ షాక్‌కు గురి చేశారు. ఆనాటి నుంచి వీరిద్దరూ కెరీర్‌పై దృష్టి పెట్టి వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘యశోద’ ప్రమోషన్స్ అప్పుడు తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు సామ్ ప్రకటించారు. ఇప్పుడిప్పుడే ఆ రుగ్మత నుంచి తాను కోలుకుంటున్నట్లు సామ్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Takkar movie review: రివ్యూ: టక్కర్.. సిద్ధార్థ్ కొత్త మూవీ మెప్పించిందా?
-
General News
Delhi liquor Scam: రాఘవ్ బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
-
Viral-videos News
Viral Video: పట్టాలపైకి పరుగున వెళ్లి.. నిండు ప్రాణాలు నిలిపి.. మహిళా కానిస్టేబుల్ సాహసం!
-
India News
Odisha Train Tragedy: మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత.. ఎందుకంటే..?
-
Sports News
World Cup: డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగానే ఆసియా కప్, వరల్డ్ కప్
-
Movies News
Kevvu Karthik: సందడిగా జబర్దస్త్ కెవ్వు కార్తిక్ వివాహం.. హాజరైన ప్రముఖులు