Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్‌ ఇంటిని కోల్పోయాడు’

ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ (Nambi Narayanan) జీవితాన్ని ఆధారంగా చేసుకుని నటుడు మాధవన్‌ (Madhavan) స్వీయ దర్శకత్వంలో...

Published : 18 Aug 2022 11:37 IST

నెటిజన్‌ వ్యాఖ్యలపై నటుడి క్లారిటీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ (Nambi Narayanan) జీవితాన్ని ఆధారంగా చేసుకొని నటుడు మాధవన్‌ (Madhavan) స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry). ఈ సినిమాకి మాధవన్‌ నిర్మాతగానూ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిని తెరకెక్కించడం కోసం మాధవన్‌ తన ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చిందంటూ తాజాగా ఓ నెటిజన్‌ వ్యాఖ్యలు చేశాడు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ మాధవన్‌ దీన్ని రూపొందించారంటూ నెటిజన్‌ చేసిన ట్వీట్‌పై మాధవన్‌ ఏమన్నారంటే..!

‘‘రాకెట్రీకి డబ్బులు సమకూర్చడం కోసం మాధవన్‌ తన ఇంటిని అమ్ముకున్నాడు. వేరే సినిమాలతో కమిట్‌మెంట్‌ ఉండటంతో ‘రాకెట్రీ’ దర్శకుడు అప్పటికప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకోగా.. మాధవనే మెగా ఫోన్‌ పట్టారు. మరోవైపు ఆయన కుమారుడు వేదాంత్‌.. స్విమ్మింగ్‌లో దేశం కోసం పతకాలు సాధిస్తున్నాడు. ఇలాంటి గొప్ప నటుడికి అభిమానిగా ఉన్నందుకు గర్విస్తున్నా’’ అంటూ తాజాగా ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. దానిపై స్పందించిన మాధవన్‌.. సదరు నెటిజన్‌ మాటల్లో నిజం లేదని చెప్పారు. ‘‘దయచేసి నా త్యాగాన్ని అతిగా చూడకండి. ఇల్లు లేదా ఏ ఇతర ఆస్తులను నేను కోల్పోలేదు. నిజానికి రాకెట్రీలో భాగమైన వారందరూ ఈ ఏడాది సగర్వంగా భారీ మొత్తంలో ఆదాయపు పన్ను చెల్లించనున్నారు. దేవుడి దయ వల్ల మా సినిమాకి మంచి లాభాలే వచ్చాయి. ఇప్పటికీ నేను నా ఇంట్లోనే నివసిస్తున్నా. ఈ ఇంటినే ప్రేమిస్తున్నా’’ అని మాధవన్‌ చెప్పుకొచ్చారు.

కథేంటంటే:

ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త‌, గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల్ని ఎదుర్కొని నిర‌ప‌రాధిగా బ‌య‌ట‌ప‌డ్డ నంబి నారాయ‌ణ‌న్ జీవిత క‌థే ఈ చిత్రం. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్‌ట‌న్ విశ్వవిద్యాల‌యంలో నంబి నారాయ‌ణ‌న్ చ‌దువుకొన్న రోజులు మొద‌లుకొని.. ఆరోప‌ణ‌ల నుంచి విముక్తి కావ‌డం వ‌ర‌కు ఈ క‌థ సాగుతుంది. ఇస్రో కోసం ఆయన చేసిన కృషి, దేశం కోసం చేసిన త్యాగాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాతో నటుడిగానే కాకుండా దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశారు మాధవన్‌. సూర్య, షారుఖ్‌ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా రూ.50 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని